"ప్రజా రాజ్యం" వచ్చేసింది!

ఎంత ఆపుకుందామనుకొన్నా ఆపుకోలేని ఉత్సాహం నాతో ఈ ఒక్క టపా రాయిస్తోంది. "ప్రజా రాజ్యం" వచ్చేసింది! (ఇది పార్టీకు సంబంధించి) నిజమైన "ప్రజా రాజ్యం" వచ్చేస్తోంది. మార్పును కోరుతూన్న జనం ఉత్తుంగ తరంగాల్లా తిరుపతిని ముంచెత్తారు, తమ హృదయంలో చెరగని ముద్ర వేసిన ఈ స్వయంకృషీవలుడు, తమ జీవితాల్లో వెలుగు నింపుతాడని గంపెడాశతో, మరోమారు రాష్ట్ర రాజకీయ చరిత్రని పునర్లిఖించడానికి ఉద్యుక్తులవుతున్నారు. ప్రపంచంలో మార్పు సహజం. నల్లజాతి దారుణ వర్ణ వివక్షకు గురయిన అ.సం.రా.లో ఓ నల్లవాడు అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నాడు(ఇది తథ్యం), మార్పన్నది ఎంత బలమయినదో ఈ సంఘటనే తెలుపుతోంది. మన రాష్ట్రంలో అధికారం కొన్ని దశాబ్దాలుగా రెండు కులాల గుప్పెట్లోనే ఉంటోంది. సామాజిక న్యాయం కాగితంపైనే అమలవుతోంది. మహాత్మాగాంధీ, అంబేద్కర్, మహాత్మాఫూలే, మదర్ థెరిసాల ఆలోచనా దృక్పథంతో ఊపిరి పోసుకొన్న ఈ కొత్త రాజకీయ శక్తి అధికారంలో అందరినీ భాగస్వామ్యుల్ని చేస్తుందని ఆశిద్దాం. నేనెప్పుడూ నా గురించి రెండు మాటల్లో వివరించమంటే "Sensitive & Sensible" అని చెప్తూంటాను. నా అభిమాన నటుడి వ్యక్తిత్వమూ అదే. ఆ సున్నితత్వాన్ని కోల్పోకుండా, వన్నె తెచ్చే వివేకంతో ప్రజల మేలు కొరకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేస్తూ, రేపటి ముఖ్యమంత్రిగా సేవలందించాలని మనసా వాచా కోరుకొంటున్నాను. జై చిరంజీవ!!!...అరుపులు...కేకలు...వగైరా...వగైరా:-)

10 comments:

ప్రసాద్ said...

మీరెంతో ఆశతో, ఉద్వేగంతో వున్నారని మీ టపా చూస్తే అర్థమవుతోంది.

సరిగ్గా ఇలాంటి ఆనందమే రామారావు పార్టీ పెట్టినపుడు నా మనసును ముంచెత్తింది.

చూద్దాం, ఆశతో ఎదురు చూద్దాం మార్పు కోసం.

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

:-)

ఔను. చూద్దాం. :-)

దేవన అనంతం said...

మీ ఉత్సాహం కడ దాక ఇలాగె వుండాలని కోరుకుంటున్నాను.

అశ్విన్ బూదరాజు said...

నాకు చిరంజీవి గారంటే చాలిష్టం కానీ ఎ-ందుకో యెడం కన్ను అదురుతుంది నిన్నటి నుండీ...

chandramouli said...

ఇంతకు ముందు రెండుకులాల చేతుల్లో ఉండేది... ఇప్పుడు మూడో కులం చేతుల్లోకి మారబోతుంది...

అలా మారకుండా... అన్నయ్య చేస్తే చాలు రాజకీయంగా.. అన్నయ్య విజయం సాధించినట్టే...
కానీ కులచాందసులను అన్నగారు (ఎన్.టి ఆర్ ) కూడా దాటలేక పోయారు .... మరి మన అన్నయ్య ఎలా చేయబోతున్నరో ....

మంచి జరగాలి అని ఆశిద్దాం ...

జ్యోతి said...

అనుకున్నా నువ్వు తప్పకుండా రాస్తావని. కాని నిన్న చిరంజీవి స్పీచ్ విన్నతర్వాత ఎటువంటి స్పందన కలగలేదు. ఆశయం, ఆశయాలు మంచివే. కాని అందులో ఎన్ని అమలు అవుతాయో, ఏమో ??

ss said...

how can he make "PRAJA RAJYAM" with the help of factionists and frequent party changers.

Bhasker said...

Sorry for sounding bit negative but... తిరుపతి సభ కు 40 కొట్ల దాక ఖర్చు అయ్యిందట.
చిరు పార్టీ లొకి వచ్చే వలస పక్షులు వచ్చే ఎన్నికల్లొ డబ్బు వెదజల్లుతారు. వీల్లంతా ప్రతిఫలం ఆశించకుండా కేవలం ప్రజల కొరకే ఇందంతా చేస్తున్నారంటారా? వచ్చే రెండు మూడు వారాలలొ చాలా మంది డబ్బు పరపతి వుండి రాజకీయ ఆర్రంగేట్రం చేయాలని ఎదురు చూసే వాళ్ళు, ఇతర పార్టీ లలొ భవిష్యత్తు లేనివాళ్ళు చాలా మంది చిరు పార్టీ లో చేరొచ్చేమో. ఇందులొ చాలా మంది కాలవ దాటడానికి ( ఎన్నికల్లొ గెలవడానికి) చిరు నావను పట్టుకు వెల్లాడే జలగలు ఉంటారనడం లొ సందేహం లేదు.

ప్రవీణ్ గార్లపాటి said...

వేచి చూడాల్సిందే ఈ పార్టీ ఏ వైపు సాగుతుందో...
మెగా తమ్ముళ్ళు ఏ మాత్రం పార్టీనాడిస్తారో ?

cbrao said...

తిరుపతి సభలో జనప్రభంజనాన్ని చూస్తే ప్రజలు మార్పు కోరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రజలు అభిమానులా లేక సామాన్య ప్రజానీకమా అన్నది ప్రజారాజ్యం భవితను తేల్చగలదు.