స్నేహితుని విజయాన్ని ఆస్వాదిస్తూ...మళ్ళీ మీ ముందుకు!

{ నేటి 'సాక్షి'లో }

{డి.ఎస్.పి."సుబ్బరాయుడు", నేటి గ్రూప్ 1 విజేత "సోమశేఖరరెడ్డి"లతో, అనంతపురం 2005}
మీకు గుర్తుండే ఉంటుంది 2006లో ఒకసారి ఇలాగే బ్లాగు ముఖంగా గ్రూప్-1లో డి.ఎస్.పి. పోస్టు దక్కించుకొన్న మిత్రున్ని అభినందిస్తూ రాసిన టపా! అదే ఫోటోలో ఉన్న మరో ప్రాణమిత్రుడే ఈ రోజు గ్రూప్-1లో మరో విజయపతాకాన్ని ఎగురవేసాడు. ఈ విజయం వెనకాల ఏడేళ్ల శ్రమ, పట్టుదల ఉన్నాయి. నిన్ననే "The Pursuit of Happyness" సినిమా చూశాను. ఆ సినిమాను సమీక్షిస్తూ ఓ విమర్శకుడు ఇలా అంటాడు ". . . The beauty of the film is its honesty. In its outlines, it's nothing like the usual success story depicted onscreen, in which, after a reasonable interval of disappointment, success arrives wrapped in a ribbon and a bow. Instead, this success story follows the pattern most common in life - it chronicles a series of soul-sickening failures and defeats, missed opportunities, sure things that didn't quite happen, all of which are accompanied by a concomitant accretion of barely perceptible victories that gradually amount to something. In other words, it all feels real." చివరి సీన్లో తన విజయాన్ని ఆస్వాదిస్తూ 'విల్ స్మిత్' చేసిన నటన అద్భుతం. ఆ భావోద్వేగమే ఒక సంవత్సరం క్రితం నేను అనుభవించాను, ఇప్పుడు నా మిత్రుని విజయంలో ఆస్వాదిస్తున్నాను. 'జయహో' సోమశేఖరా!



{సోము, నేను - 2008}